ఎవరో రావాలీ ఈ జానపదమును పూరించాలీ...

ముందు మాట: పోయినేడాది వేసవి రోజు ప్రొద్దుప్రొద్దున్నే అంటే సుమారు ఎనిమిది గంటల సమయంలో లేత ఎండలో తడుస్తూ [విడ్డూరమే మరి!] లేలేత తోటకూర త్రుంపుకుంటున్న వేళ వచ్చారు అంకులు గారు. 'ఇదేమమ్మా అప్పుడే లేచావే?' అనుకుంటూ. అలవాటండి అన్న నా సమాధానంతొ మొదలైన మా సంభాషణ, 9:30కి ముగుస్తుందనగా 'మా నాన్న పాడేవారూ అంటూ ఆయన పలికిన పదమిది. కాని ముందు వరసలు మరచిపోవటంతో నాకు తృప్తిగా అనిపించక తోచిన యత్నాలు చేసినా పూరణ దొరకక మీ ముందు వుంచుతున్నాను!
*********************************************************************
అసలు మాట: "..... నుదుట గల భాగ్యరేఖయు మసి బొట్టా తుడిపివేయను మానవ నాధ!"
*********************************************************************
అదండీ నా సమస్య. కనుక బ్లాగుశయులార! తెలిసిన యెడల కాస్త చెప్పి పుణ్యంకట్టుకోరూ? చిన్న వివరణ ఏమంటే, ఇది వరంగలు ప్రాంతానికి చెందిన పాట కావచ్చు.

మనసులో మాట: మునుపు ఏమి వ్రాయలన్నా నాకు ముందే సిరివెన్నల గారో, ఆరుద్ర గారో ఆఖరుకి కలల్లో నేనేవాడేసిన వైనంగా వుండేది. ఇప్పుడేమో బ్లాగరు మిత్రులు కోవకి చేరిపోయారు. అవునూ, ఇంత కాలం ఆనందం నేనెందుకు మిస్సయ్యనూ? :) ముందే చెప్పాను కదా, పదాలు దొరకక అక్కడా ఇక్కడా అరువు తెచ్చుకుంటున్నానని.

No comments:

Post a Comment