మంచు పూల పేరంటం

క్రిందున్న నేల రాణికే ఇన్ని సంబరాలాని
అక్కసుపడ్డట్టున్నాడు ఆకాశరాజు,
పైనేవో పందిళ్ళేస్తున్నాడు తాను మరి
ఒక్కడాడేటి వసంతాలకో.
జంటలేని కోలాటాలకో.

మబ్బు ముగ్గులేసి, మంచు పూలుజల్లి
చుక్కల గొబ్బిళ్ళెట్టి, గాలిపిల్లని పట్టుకొఛ్ఛి
చుట్టూ తిరిగి మేళమాడుతున్నాడు.
చందమామని వేడుకకి రావాలని,
వంతులాడుతున్నాడు.

12 comments:

  1. చాలా అద్బుతంగా ఉంది.
    ఆకాశపు సంబరాలు అన్న ఊహే హృద్యంగా ఉంది.
    మీ పదచిత్రాల సొబగు కూడా అందంగా అమరింది.

    ReplyDelete
  2. ధన్యవాదాలు సుమండీ!

    ReplyDelete
  3. అద్భుతం. చాలా బాగుంది.

    ReplyDelete
  4. జన్య, ప్రపుల్ల గార్లు, ధన్యవాదాలు. ఇలా మరొకరు గుర్తిస్తేనే కళకి వెలుగువస్తుంది.

    ReplyDelete
  5. ఉషగారూ, మీరు ఇది చదివారా?

    ReplyDelete
  6. లేదు రాఘవా, ఇపుడు చదువుతాను. ఎందుకో 2గం. ముందరగా మెలకువవచ్చేసిందేం అనుకున్నా, ఇందుకన్న మాట. మీకు చాలా కృతజ్ఞతలు.

    ReplyDelete
  7. ఎంతద్భుతంగా రాస్తారండీ...కళ్ళ ముందు దృశ్యం .....చెప్పక్కరలేదనుకుంట..మీవన్ని ఒకరోజు ముందుపెట్టుకుని చదవాలి .

    ReplyDelete
  8. * చిన్ని, ధన్యవాదాలు. మనసుని ఉత్తేజపరిచో, ఉద్వేగపరిచో కవిత్వాన్ని ప్రేరేపించటంలో ఆకాశానికి అగ్ర తాంబూలం ఇవ్వొచ్చేమో. ఆకాశమంత ప్రేరణని అలివి కానీ భావోద్వేగాన్ని కలిపి ఒకసారి - మీరు చదివిన పోలిక, ఆకాశరాజు అని, "అవునసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు?" http://maruvam.blogspot.com/2009/03/blog-post_21.html అని, "ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసే ఆకాశం..." http://maruvam.blogspot.com/2009/04/blog-post_03.html అనో వ్రాసాను. ఆకాశం గురించే చూడాలంటే ఈ రెండూ ఉదాహరణలు. కానీ ఇవే కాదు మీ అభీష్టానుసారమే చదవండి, సద్విమర్శలు గుప్పించండి. నెనర్లు.

    ReplyDelete
  9. మంచుపూల పేరంటానికి మల్లెజాజి విరగపూసినట్టు ( మంచురోజుల్లో మల్లెజాజి పూస్తుందా? పూయకపోతే కవిత్వంలో పూస్తుందిలెండి ) చిట్టి కవిత చిత్తమందు నిలిచింది.

    ReplyDelete
  10. భా.రా.రె. దీన్ని బట్టి మీ వూర్లో మల్లెలు పెంచరని తెలిసిపోతుంది. మేము లేట్ ఫాల్ నుండి యెర్లీ స్పింగ్ వరకు ఇళ్ళలోనే గార్డెన్ లాంప్స్ తో వాటిని కాపాడి పూయిస్తాము. :) నా చిరు కవిత నచ్చినందుకు సంతోషం. ఏళ్ళ తరబడి ఘనీభవించిన నైరాశ్యం కరిగిన మొదటి లావా జ్వాలలివి. మళ్ళీ నాచేత కూడా చదివించారు. థాంక్స్.

    ReplyDelete