లక్ష జన్మల కోటి లేఖల్లో ...

మరోసారీ అదే లేఖా అంటావు.
మునుపూ ఇదే మాట అన్నావు మరి.
మొన్నటిది మడత విప్పలేదని,
నిన్నటిది నిను చేరలేదనీ అంటావు.
ఇదేంటి మళ్ళీ అనంటావు,
ఒక్క లేఖకి తీరికెక్కడా అంటావు.
వేయి ప్రతులు ఒక్కసారి పంపివుంటే,
ప్రతీ పలుకు కోటి సార్లు వ్రాసివుంటే,
అప్పుడింక మాటలాడక వూరుకుంటావు.
గత జన్మ బకాయి తీర్చుకుంటావు.
ఇప్పటిది మరుసటి జన్మకి మళ్ళీ వాయిదా వేస్తావు.
ఎప్పటికీ తీరని ఋణాలు వుంచుకుంటాం.
ఇప్పటిలా జతచేర్చమని మొక్కుకుంటాం.
మనం కలిసుండే లేఖల్లో మళ్ళీ మళ్ళీ కలుస్తాం.
లక్ష జన్మల కోటి లేఖల్లో ఒకరినొకరు తెలుసుకుంటాం.

4 comments:

  1. కొంచెం అర్ధం కాలేదు. ఈ కవితకి ప్రేరణ ఏదో కొద్దిగా చెబుతారా?
    మీ బ్లాగు టైటిల్ బావుంది. ఇంతకీ "మరువం" అంటే అర్ధమేమిటో తెలుసా?

    ReplyDelete
  2. "వాడినా వాసన వీడని మరువం ... ఈ విశెషనం అన్నిటికీ వర్తిస్తుంది కదా! తిరిగి మేల్కొన్న నాలోని తృష్ణకి కూడాను... " అంటూ ఈ కూడలిని చేరాను. మీ ప్రశ్నతో వేరు వేరు అర్థాలు గోచరిస్తున్నాయి. మీ బోటివారు నన్ను 'మరువం' అని మాటిస్తున్నట్లుగా కూడా వుంది :) [కొంచం అతిశయమే అనుకోండి]. మీరు చెప్పరాదా నిఘంటువుల్లో మరేదైనా అర్థముందేమో [నా భాషాప్రావీణ్యం తక్కువని implicitగా మీకు అర్థమైందనుకుంటాను]

    "ప్రేరణ " కన్నా నాకు "పూనకం" వంటిదండీ ఈ కవితావేశం. అది వంటి మీదకి కాక మనసుకి పడుతుంది. అది దిగాక ఏమి గుర్తుకిరాదు. ఇకపోతే ఇవన్నీ నా మనసులో వున్న ఒకరికొరరు కావాల్సిన విరుద్ధస్వభావాల వారి మధ్య బంధాలవంటివి [కొంచం నా కవితాతిశయోక్తి కలుపుకొని] "నాకు వేయి పనులు, తీరికెక్కడా? లక్షసార్లు చెప్పాను. క్షణమొక యుగం, గత జన్మ పుణ్యం, వచ్చే జన్మకైనా వస్తావా? ఏడుజన్మలకీ మనం తొడు-నీడ - ఇలాంటి వర్ణనే అనుకొండి" ఈ వివరణ చాలా? మీ బ్లాగు చూసాను. రోజుకో క్రొత్త బ్లాగుచూసే పుణ్యమో/ఇంకో జన్మో [రోజొక యుగంలా, మళ్ళీ పుడుతున్నటూ వున్నట్లుగా :)] ఇలా కలుగుతున్నందుకు చాలా అనందం.

    ReplyDelete
  3. ఉషగారూ,
    మీరు చెప్పిన వివరణ చదువనవసరం లేకుండానే నాకు అర్థమైంది, బావుంది.

    ReplyDelete
  4. అంటే నాదీ, మీదీ ఒకటే భాషన్నమాట, మనం ఒక వూరివారమేనన్నమాట. ధన్యవాదాలు, రాఘవగారు.

    ReplyDelete