[శతటపోత్సవ వేళ..] మహా శ్వేతం, రంగుల ఆవిష్కారమా!

సప్త వర్ణాల మిళితం శ్వేతం
నలుపు అన్ని వర్ణాల సమ్మేళనం
తెలుపు నవ్వితే రంగులన్నీ తేటతెల్లం
నలుపు వొలికితే వర్ణాలన్నీ మటుమాయం

ఆది పరాశక్తి మేని వన్నె శ్వేతం
విశ్వశాంతికి చిహ్నం శ్వేత పతాకం
సంకీర్ణ వర్ణాల మేఘం రువ్వు శ్వేతకాంతి
శాంతికి, శక్తికి మూలం శ్వేతక్రాంతి

పసిపాప నవ్వు శ్వేతం ఆ కంటి నీరు నీలం
చెంగల్వ తెలుపు చిన్ని కృష్ణయ్య నలుపు
సీతమ్మోరి పూబంతి తెలుపు, చేత బట్టిన రామయ్య నలుపు
ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం

మల్లీ జాజి తెలుపు, జగమంతా మరులు గొలుపు
మంచి మనసు తెలుపు, తన మాటది గెలుపు
తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు
వెలికి తెచ్చేటి రంగుల కలలు నిత్య జీవితానికి శ్వాసనిశ్వాసలు

65 comments:

  1. చాలా సంతోషం సప్త వర్ణాల సమ్మేళనం మీ శత రచనలను పూర్తి చెయ్యడం. త్వరలోనే పి డి ఎఫ్ రిలీజ్ చేస్తాను.

    ReplyDelete
  2. శ్వేతవర్ణం వర్ణన చాలా బావుంది .
    విశ్వా శాంతికి చిహ్నంగా శ్వేత కపోతాన్ని ప్రస్తావిస్తారనుకున్నా !
    మూడవ పేరా లో నలుపు తెలుపుల పోలిక ఎంతందంగా చెప్పారు !
    ఏడు రంగుల జీవితంలో చివరకు మిగిలేది శ్వేత వర్ణం అన్నమాట !
    అదేగా ప్రశాంతతకు చిహ్నం !మరణం నలుపేమో .....

    ReplyDelete
  3. * ప్రదీప్, నా 100 వ టపాకి ఏమి రాయాలా అని యోచిస్తున్నపుడు ఇలా చక్కని హరివిల్లు సంకల్పించి, అందులో నాకు పాలు పంచిచ్చి ఒక మరువరాని అనుభూతినిచ్చారు. కృతజ్ఞతలు. ఆనంద్ గారు ఆ కొసమెరుపుని జోడించటం హరివిల్లు వెనుగ్గా విశాలమైన ఆకాశం మాదిరిగా అనిపించింది. ఇరువురికీ నా ధన్యవాదాలు.

    ReplyDelete
  4. * పరిమళం గారు, మీరన్నాక ఆ ప్రయోగమూ "కపోతం" బాగుంది అనిపించింది. కానీ సమరమైనా, స్నేహితమైనా శ్వేత పతాకం ముందుగా శ్వేతాశ్వం మీద పంపుతారు కదా, అది దృష్టిలో వుంచుకుని అలా వ్రాసాను. ఇక జననం అన్నది అంధకారమైన తల్లి గర్భాశయం నుండి, కనులు మూసుకుని ఈ లోకానికి వచ్చేది కనుక నేను నలుపుకి ప్రతీకగా అది వాడాను. ఒక జీవితకాలం వసించి, జ్ఞానసముపార్జనతో వెలిగే ఆత్మ ఇంతకన్నా ప్రదీప్తమైన అమర లోకాలకి తరలివెళ్ళటమే, ముక్తి, మోక్ష ద్వారాలు తెరుచుకు స్వేఛ్ఛావిహంగమై శ్వేత వర్ణ కాంతులతో నిష్క్రమించేదే మరణం, నా వరకు అదే తెలుపు. ఇప్పుడు చూడండి ఈ అల్లికా మీకంగీకారమౌతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. చిన్ని మొలకలా తెలుగు బ్లాగ్లోకంలో చిగురించిన ఈ మరువం నేడు దట్టమైన పొదలా తన కవితా పరిమళాలు వెదజల్లుతుంది. శతటపోత్సవ శుభాకాంక్షలు ఉష..

    ఒక్క నిజం చెప్పనా.. నాకైతే ఈ టపాలు చూస్తే అసూయ కలుగుతుంది ఎన్నోసార్లు. నేను ఈ జన్మలో ఒక్క కవితైనా ఇలా నా మనోబావాలు వెల్లడించగలనా అని.. ప్రయత్నం చేయాలన్నా భయంగా ఉంటుంది. ..

    take it light .. keep rocking dear..

    ReplyDelete
  6. జ్యోతిగారి మాటే నా మాట ..అభినందనలు .మీవైపు వస్తే చాలు మరువపు గుభాళింపులు..అందుకే చిన్న ముక్క తెంచుకుని నా బ్లాగ్ వనం లో పెట్టుకున్న ...కొత్త చిగురు తోడిగినప్పుడల్లా నా వనం కూడా గుభాళించాలని దురాశతో ..

    ReplyDelete
  7. ఎక్కడికో తీసుకుని వెళ్ళారు. వర్ణ సమ్మిశ్రమంలో మునిగి తేలి నల్లనయ్యననుభూతి చెందాను. ఎంతైనా నల్లనయ్య నల్లనయ్యే కదా.

    http://thinkquisistor.blogspot.com/2008/11/blog-post_23.html

    చాలా భావాలు కనిపిస్తున్నాయి ఈ వాక్యాలలో...

    "తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు
    వెలికి తెచ్చేటి రంగుల కలలు నిత్య జీవితానికి శ్వాసనిశ్వాసలు"

    పరమ సత్యం ఏమన్నా మీకు తెలిసిందా అని అనిపించింది.

    Absolute nothing itself means absolute some thing. Some great thing, the one "ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం" ఇది వర్ణాద్వైతమా?

    ReplyDelete
  8. ఉన్నతైన భావాలంకరణ. ఇక మీ బ్లాగుని నా లిస్ట్ లో ఉంచాలి.

    ReplyDelete
  9. "ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం"

    అద్భుతమైన వివరణ.

    @పరిమళం గారు,

    నలుపు మరణానికి చిహ్నం అని ఎలా అనగలము? అన్నింటినీ తనలోనే ఇముడ్చుకున్నది అని ఇక్కడె ప్రస్తావన ఉంది కదా. అన్నీ తనలోనే ఉండేదెప్పుడూ అశాశ్వతం కాదు కద. సర్వాన్నీ తనలోనే ఉంచుకున్న ఆ నల్లనయ్య నల్లని వాడే కదా?

    ReplyDelete
  10. బ్లాగ్మిత్రుల్లారా, మా "హరివిల్లు" సప్తసంకలనాన్ని ఇక్కడ చూసి మీ అభిప్రాయం తెలుపండి/పెద్దలు ఆశ్వీర్వదించండి. ఇది మా వరకు తొలి ప్రయత్నం/ప్రక్రియ http://www.miriyala.in/dl/Harivillu.pdf?attredirects=0

    ReplyDelete
  11. "ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం"

    "తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు"

    అందంగా వుంది.. కవిత

    ReplyDelete
  12. ఉషాగారు , మీ అల్లిక బహుబాగు !
    నా ఉద్దేశ్యం పుట్టుకతో లోకాన్ని ( వెలుగును ) చూసి వెళ్తూ కన్నులు మూసి(చీకటి ) అని మాత్రమె ...
    శత టపోత్సవ శుభాకాంక్షలతో పాటూ ...సహస్ర టపోత్సవం పూర్తిచేసుకోవాలని ఆకాంక్ష !

    ReplyDelete
  13. ఉషగారు..ముందుగా శుభాకాంక్షలు.వంద టపాలు విజయవంతంగా,అద్బుతంగా, అర్ధవంతంగా, నిర్విరామంగా పూర్తిచేసినందుకు.

    ReplyDelete
  14. * జ్యోతి, మీ దైన బాణీలో విలక్షణమైన వ్యాఖ్య. ;) ధన్యవాదాలు. మరువం కుదురిపుడు ఎపుడూ మీ అందరినీ రంజింపచేస్తూనేవుంటుంది.

    ReplyDelete
  15. క్షమించండి ఆలస్యంగా వచ్చా!
    తెలుపు నలుపులపై శ్వేతపత్రం
    మరువపు శతం
    సప్తవర్ణాల కవితావిరుల తో జతజేరి
    గుబాళింపజేస్తోంది
    తెలుగుబ్లాగువనాన్ని.

    ReplyDelete
  16. * చిన్ని ఈ రోజు ఉదయం నా టపాలకి tags పెడ్తూ గత డిశంబరు నెలలో వ్రాసిన "వానతల్లి - వేగిరపడకే కూసింత పరుగాపవె" , "మంచు పూల పేరంటం" చూసినపుడు హిమం, హిమబిందువులు తలపుకొచ్చాయి, అంటే మీరన్న మాట. బహుశా తీరిక లేదేమో అనుకున్నాను. చిన్న కొమ్మేమిటటా ఏకంగా కుదురే నిరభ్యంతరంగా మీ హిమ సుమాలకి తోడుగా తీసుకుపోండి. నెనర్లు.

    ReplyDelete
  17. * గీతాచార్య, మీరు వ్యక్తపరిచిన అనుభూతి కలిగించగలిగినందుకు మురిపెంగా మరువం మరో చిగురేసి చిలక నవ్వు నవ్వనుంది. నిగూఢతని ప్రశ్నిస్తూ సమాధానం మీరే వెలికి తెచ్చారుగా. హరివిల్లు వన్నెల్లో మునక వేసాక కలిగిన మనస్థితిది. అది చేరాల్సిన రీతిలో రస హృదయాలని చేరినందుకు ముదావహం. మీ కొసమెరుపు "ఉన్నతైన భావాలంకరణ. ఇక మీ బ్లాగుని నా లిస్ట్ లో ఉంచాలి" కాసింత సగర్వాన్ని మరింత వినయాన్ని పంచింది. నెనర్లు.

    ReplyDelete
  18. * సృజన, ఇక లాభం లేదు వెన్న ముద్దతో మన నల్లనయ్యకి దిష్టి తీయాల్సిందే, అమ్మో ఎన్నిసార్లు నానాడో మన నోట ;) మీ వివరణకి ధన్యవాదాలు. వస్తుండటం ఒక్కోపరి నల్లనయ్యని మరువాన విడిచి వెళ్ళటం మానకండేం. నెనర్లు.

    ReplyDelete
  19. * శివ, అరుదుగా అరుదెంచే మీ వ్యాఖ్యల్లో ఆ శత టపా ఒకటి కావటం ఆనందంగా వుంది. వన్నెలని వివరించే ప్రయత్నంలో నేను కూడా వాటి అందాలని ఎంతో మక్కువగా దర్శించాను. అందుకే అంత మిన్నగా అమిరాయి పదాలు. నెనర్లు.

    ReplyDelete
  20. * పరిమళం, నిజానికి ఆ రెండిటి నడుమా వున్నా "రంగు రంగుల అందమైన లోకానికి" నేను తగు న్యాయం చేయలేదేమోనని, ఒకరైనా సద్విమర్శని అటు గుప్పిస్తారనుకున్నాను. కానీ తెలుపు నలుపుల బలీయ ప్రభావం ఆ శంకని నొక్కిపెట్టేసిందన్న మాట. మళ్ళీ తొంగి చూసి అభినందించినందుకు వందనాలు.

    ReplyDelete
  21. * సుజ్జీ, మీరంతా ఎంతో అభిమానంగా నన్ను ప్రోత్సాహించబట్టే నా కోసమే నేను వ్రాసుకుంటున్నానన్న అహం నుండి మీ కోసం వ్రాయలనుంది అన్న దిశగా పయనిస్తున్నాను. ఈ పయనం ఇకపై కూడా మీకు పరిమళాల్ని పంచుతూనేవుంటుంది. నెనర్లు.

    ReplyDelete
  22. * విజయమోహన్ గారు, ఎంత మాటనేసారు. మన్నన వుండాల్సింది మాకండి. ఎంత చక్కగా మోహనంగా వ్యాఖ్యానించారండి. నా కవితలకి సార్ధకత సమకూరుతున్నట్లేను. కృతజ్ఞతలు.

    ReplyDelete
  23. జ్యోతి గారు చెప్పినట్లు చిన్ని మొలకలా ప్రారంభమైన మరువం నేడు దట్టమైన పొదగా వేళ్ళూనుకున్న శుభ సందర్భంలో శత టపోత్సవ శుభాకాంక్షలు.

    ఇదీ అని చెప్పలేను. మీ భావ సంపదకు, పద సంపదకు మరోసారి మనసు తీరా అభినందనలు ఉష గారూ !

    మరిన్ని గుబాళింపులతో కవితా ప్రియుల్ని ఇలాగే అలరించాలని ఆకాంక్ష!

    ReplyDelete
  24. * సుజాత గారు, "ఇదీ అని చెప్పలేను" అన్నది పరస్పర భావన. అభిమానం అన్నది అన్నివేళలా మాటల్లోనే చూపనవసరం లేదు. :) అది మనసుకి తెలిసే భాష. మీ శుభాకాంక్షలకి కృతజ్ఞతలు.

    ReplyDelete
  25. ఉష గారు నిజం చెప్పాలంటే నాకు కాస్త కఠినం గా ఉన్న పదాలతో కవితలు చదవడం అంత ఇష్టం ఉండదు ..నాకు భాషా పరిఙ్ఞానం కాస్త తక్కువ.. కానీ మీ కవితలు ఎంత బాగుంటాయంటే వాటిని ముందు పెట్టుకుని నాలుగైదు సార్లు చదివి అర్దం చేసుకుని అప్పుడు గాని వదలను.. అంత చక్కగా రాస్తారు.. ఇప్పుడు మీ కవితలు సరళముగానే ఉంటున్నాయనుకోండి ...మీకు నా హృదయ పూర్వక శుభాబినందనలు

    ReplyDelete
  26. * నేస్తం, అంత నిష్కర్షగా మీకు ఏవి నచ్చవో చెప్పి, అంతే అభిమానంగా నా కవితల పట్ల మీకు గల మక్కువని తెలిపినందుకు చాలా సంతోషం. ఇకపై కూడా సరళంగానే మీరు చక్కగా వున్నాయి అనేమాదిరే వ్రాస్తానికి ప్రయత్నిస్తాను. నా నేస్తం కూడా అదే అన్నారు. వ్రాస్తూ పోతున్న క్రమంలో నేనూ ఎదుగుతున్నాను. భాషలో, ప్రక్రియలో మార్పు వచ్చిందని నాకూ అనిపిస్తుంది. అపుడపుడూ ఛా ఇదేమిటి మాటల్లావుందేం అనిపించేంత సరళంగా వ్రాస్తానికపై, సరేనా? ;) నెనర్లు.

    ReplyDelete
  27. ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

    ఇది వందవ టపానేనా ? జీవిత సారం చదివినట్టుంది ఉష గారు. ఇప్పటి వరకూ ఎన్ని అనుభవాలూ? ఎన్ని అనుభూతులు ? ఎన్ని వర్ణనలూ ఎన్ని వివరణలు.. ఇలా సదా.. మీ భావావేశం బ్లాగులోకంలో మరువపు తావిని నింపాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  28. "చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి" అన్న పాట నాకెంతో ఇష్టం.

    "కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ" అనే వాక్యాలు నాకు శిలాక్షరాలు

    వెలుగు నీడలు సినిమాను ఎన్నిసార్లు చూసుంటానో, తెరపై, మదితెరపై.

    చాన్నాళ్లక్రితం చెంగల్వపూలు ఎరుపని నేనూ, తెలుపని నా మిత్రుడూ వాదులాడుకొని, వాడు చూపిన ఆధారాలతో నేను ఓటమిని అంగీకరించాను.

    అంత్యప్రాసలు కవితలకు ఇంత అందాన్నిస్తాయని ఇప్పుడే చూస్తున్నాను.

    కంటినీరు నీలం అన్న వాక్యాలు చదివి - మా అమ్మాయి మూడో నెల వయసప్పుడు, కళ్ళేమిటి నీలంగా ఉంటున్నాయి కొంపతీసి కామెర్లా అని భయపడుతూ, డాక్టరు వద్దకు తీసుకువెళితే, మీరు భలే వారే మాష్టారు, నీలం కళ్లు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అందంగా కూడా ఉంటాయి. కంగారుపడకండి. అని పంపించేసారు. మా అమ్మాయి కళ్లు ఇప్పటికీ చాలా అందమైన కళ్ళే.

    పై వాక్యాలు ఈ కవితలోని ఒక్కొక్క వాక్యమూ నాలో రగిలించిన భావాలు.

    అన్ని భావాల్ని గుప్పెడు పదాలలో ఇమడ్చటం మాటలా? మాటలమాంత్రికులైతే తప్ప.

    గొప్ప కవిత, మంచి వస్తువు, చక్కని అల్లిక.


    ఏవైనా భిన్న వస్తువులను పోల్చుతూ కవితవ్రాసేపుడు, పడికట్టు పదాలు కాక కొత్త పదాలు వేసి ఆశ్చర్యానికి గురిచేయటం గొప్ప టెక్నిక్. ఒక్కోసారి కత్తిమీద సాము కూడా. కానీ భలే అమరింది ఈ కవితలో. (పరిమళంగారూ మీలానే నేనూ నూ)

    చాలా రోజులకు ఒక మంచి కవిత చదివాను.
    వందటపాలు పూర్తిచేసుకొన్న సందర్భాన శుభాభినందనలు.
    మీ కలం నుంచి సహస్రాన్ని ఎదురుచూస్తున్నాను.
    ఆలస్యానికి మన్నింపు కోరుకుంటూ....

    అభినందనలతో
    బొల్లోజు బాబా

    ReplyDelete
  29. మీకు నా హృదయ పూర్వక అభినందనలు .సఖి సినిమాలోని పచ్చదనమే పాట విన్నప్పుడు అనుకున్నాను ఇంతకన్న అందం గా ఎవరూ రాయలేరు అని.కాని అలా అందంగానూ,"తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు" అనే పరమ సత్యం తోనూ మనసు దోచేసారు.

    ReplyDelete
  30. రెండుమాటలు. ఒకటి వంద టపాలు పూర్తిచేసినందుకు.మరొకటి రంగుల్లోని మర్మాన్ని మర్మంగానే ఉంచింనందుకు. అభినందనలు. ధన్యవాదాలు.

    ReplyDelete
  31. * ఆత్రేయ గారు, గుర్తుందాండి, మీ కవితలకి ప్రతి కవితలు వ్రాస్తూ పరిచయమయ్యాను. అలా అలా ఎదిగి ఈనాటికీ మీబోటి వారి ముందు వొదిగే వుంటుంది మరువం. అనుభూతుల విహారాలు, అనుభవాల విలాపాలు, వూహల విలాసాలు వివరించిన వర్ణనలు, వర్ణనాతీత వివరణలు అన్నీ ఆ కవితా భారతి ప్రసాదం. మీవంటి సాహితీ మిత్రుల ప్రోత్సాహం. నమస్సుమాంజలులు.

    ReplyDelete
  32. * బాబా గారు, ఏ పూర్వ పరిచయం లేకుండా ఇట్టే మైత్రి కలవటం బ్లాగ్లోకం నాకు వొసగిన సదుపాయం. ఇంకా సంశయం వీడని మనసుతో వ్రాసిన నా మలి టపాకి వ్యాఖ్య వ్రాయటం ద్వారా నాకు పరిచయమయ్యారు మీరు. చిరు మాటల్లో చెప్పలేనంత ధీమానిచ్చారు. ఒకవిధంగా గురుతుల్యులు, ఎందుకో మీకు తెలుసు. మీ ఈ వ్యాఖ్యలోని ప్రతి మాటా నాకు అపురూపం, ముఖ్యంగా మీ పాప నీలి కళ్ళు, ఓ చిన్న కవిత వ్రాయాలనివుంది. ఇంచక్కా "నీలాల కళ్ళల్లో మెల మెల్లగా నిదుర రావమ్మా రా, నెమ్మదిగరా" అని పాడి పడుకోబెట్టేవారా? మీకు నచ్చిన ఆ "చీకటి వెలుగుల" పాట నాకూ ఇష్టమేనండి. అలాగే కలల్లోనే సగం జీవితం గడుపుతుంటాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  33. * రాధిక, మీ తమ్ముడి మీద వ్రాసిన కవితకి మా అన్నయ్య మీద వ్రాసిన కవితకీ పోలికలు వెదుకుతూ మీకు తారసపడ్డాను. తర్వాత అరుదుగానైనా గాఢంగా పెనవేసిన నెయ్యం మనది. మీరిచ్చిన కితాబు అంతా ఇంతానా. గోదారికి వరదొచ్చినంత ఆనందంగా వుంది. నెనర్లు.

    ReplyDelete
  34. * మహేష్, జీవితమే మార్మికం. ఇక ఆ మర్మం కూడా విడతీస్తే ఏముటుంది కనుకనా. గత డిశంబరులో నేను వ్రాసిన మొదటి విమర్శనాత్మక కవిత "చక్రభ్రమణం" కి తొలి వ్యాఖ్య మీదే. నిజానికి నేను అనుమానించినట్లు ఎవరూ ఏ విసుర్లూ కురిపించలేదు. అప్పుడు ఏర్పడిన విశ్వాసమీనాటికీ అటువంటి ప్రయోగాలకి నన్ను పురికొలుపుతూనేవుంది. మీది విలక్షణమైన బాణీ. రచనలైనా, వ్యాఖ్యలైనా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పదికోణాలు తెలిసున్నా మీనుండి మరోకోణం దర్శించగలం. కృతజ్ఞతలు.

    ReplyDelete
  35. Got it through an Indian friend Nice expression.

    ReplyDelete
  36. ద్విగ్విజయంగా 100 తప్పులు పూర్తిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు ఉష గారు

    ReplyDelete
  37. అయ్యో ఇది నేనింతవరకూ చూడనేలేదు.
    ఉషా, మీశతటపోత్సవశుభసందర్భంలో శతపత్రసుందరి అయిన మీమరువం శతసహస్రకోటిపత్రసుందరిగా కలకాలం మమ్మల్నందరినీ ఇలాగే అలరించగలదని ఆశిస్తూ ..
    మీ స్నేహితురాలు, మాలతి.

    ReplyDelete
  38. మఱీ ఇంత త్వరగా నూఱు టపాలూ పూర్తయ్యాయంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉందండీ... అభినందనలు.

    ౧ ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం
    ౨ తెలుపు దాచిన రంగులు నలుపు దోచిన రంగులు వెలికి తెచ్చేటి రంగుల కలలు నిత్య జీవితానికి శ్వాసనిశ్వాసలు

    బావున్నాయండీ ఈ పంక్తులు :)

    ReplyDelete
  39. హరేకృష్ణ, ప్రతి వ్యాఖ్యలోను ఒక ప్రశ్నో, లేదా మీరు చదివిన విషయమొకటి చెప్తూనో వుంటారు. అది మీ ప్రత్యేకత. ఈసారి విశేషం, [నిజానికి ఇదీ బావుంది సుమా!] మీ వ్యాఖ్యలోని చిన్న అచ్చుతప్పు నాకు మాత్రం మంచి నవ్వునిచ్చిందండి. "టపాలు" బదులు "తప్పులు" అయినా సరే మీఅందరికీ కవితానుభూతి అనే అపరాధరుసుం కట్టేస్తూ బండి లాగేస్తాను మరి. ఏమంటారు? ;) వ్యాఖ్యకి నెనర్లు. వతను తప్పక వచ్చి పలుకరించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  40. Faustin Donnegal, welcome to the land of expressions. This is quite a bit of pleasant surprise to me. This is my 100th post and your comment adds to it. Much of my time I dwell in this poetic land. I remain indebted to whoever introduced you to my blog. I am dreamer and many of my dreams are like how your post on Titanic has expressed the total liberation of the heroine. Good luck with your new blog and I hope to have more visits of you at maruvam. Thanks for your compliment.

    ReplyDelete
  41. *మాలతి గారు, మీ తూలిక ద్వారా మొదలైన మన స్నేహం, మన ఉత్తరాల్లోని సంభాషణలతో వ్రాయాలన్న సంకల్పాన్ని కలిగించటం, ఆ పై నా నేస్తం నడుం కట్టి నన్ను నిలవనీయనంత ప్రోద్భలంతో నెట్టటంతో పాతిన ఈ కుదురు, ఈ నాటికి ఈ మైలు రాయి దాటింది. మీ అభినందనలకి ధన్యవాదాలు. నెనర్లతో సదా మీ నెయ్యం కోరే మీ నేస్తం - ఊష

    ReplyDelete
  42. * రాఘవ, విలక్షణంగా వుండే మీ వ్యాఖ్యలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. తీరిక తక్కువైనా మీరు అపుడపుడు తొంగిచూస్తారని తెలుసు. అదీకాక ఒకటొకటిగా పాత టపాలు చూస్తారనీ తెలుసు. అదీ కాక ఒకటీ రెండు సార్లు నావి చదువుతూ మీకు జ్ఞప్తికి వచ్చిన పద్య కవితలు ఉదహరించారు [ఉదా: (1) నీవు - నా అలక http://maruvam.blogspot.com/2008/12/blog-post_13.html మీ వ్యాఖ్య "ఇది చదివి నాకు దేవులపల్లివారు గురుతుకొచ్చారు." (2) మంచు పూల పేరంటం http://maruvam.blogspot.com/2008/12/blog-post_16.html ] అటువంటి సంధర్బాల్లో నేనెందుకు వ్రాస్తున్నాను అన్నదానికి మరో సమాధానం దొరికినట్లనిపించేది. అరుదైన అనుభూతిని మిగిల్చేది. త్వరలో మీరా సమయాభావం నుండి వెలికి వచ్చి మరువాన్ని పలుకరిస్తూవుండాలని ఆశిస్తూ - మీ స్నేహితురాలు ఉష.

    ReplyDelete
  43. ఉషగారికి... నా హృదయపూర్వక అభినందనలు...
    మరువపు గుభాళింపుని ఆలస్యంగా ఆస్వాదించాను...

    ReplyDelete
  44. naa kotta blaagu sahacharudu.blogspot.com choodaroo.

    ReplyDelete
  45. * పద్మార్పిత, ఈ మైలురాయి ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతుంది, చిన్నప్పటినుండీ ఎక్కువగా నూటికి నూరో, ఆ దగ్గరలోనో మార్కులు చూసుకుని ఈ వంద దగ్గర కాస్త మమకారం పోలేదు. అంతే! ఇకపోతే ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్న డైలాగ్ గుర్తువుంచుకుని వ్యాఖ్యా మొలక నా వనాన నాటేసారు, అది చాలు. మొదటి నుండి కవితామైత్రి అతి సన్నిహితంగా వుంది మన నడుమ, అదింకా మున్ముందు ఇంకా బలీయంగా సాగాలని కోరుకుంటూ... మీ ఉష.

    ReplyDelete
  46. * సృజన, గుర్తుంచుకున్నారా నన్ను. మీరంత గౌరవమిస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతాను, 'ఏదీ ఇంకోసారి అనండి "ఉషాజీ" అని నా వీనులవిందుగా' అని. ;) నెనర్లు.

    ReplyDelete
  47. * వర్మ గారు, మీ బ్లాగు ఇంతకు మునుపే చూసాను, సముచితమనిపించినపుడు తప్పక వ్యాఖ్యానిస్తాను. మీరంతగా అడగాలటండి! సాహితీ మైత్రి ధర్మం ఈ మరువం మరవదు. :)

    ReplyDelete
  48. కాస్త ఆలస్యంగా వచ్చాను.. మరువపు గుబాళింపులు ఇలాగే కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ..

    ReplyDelete
  49. కవితల కి దూరం గా ఉండే నేను మీ కవితలను చదవకుండా వుండలేక పోతున్నాను.చాలా బాగుంటున్నాయి.
    మీకు ఆలస్యం గా చెపుతున్నందుకు మన్నించి , శతటపోత్సవ శుభాకాంక్షలందుకోండి.

    ReplyDelete
  50. * మురళీ గారు, మన ఇద్దరం శతం మైలురాయిని దాదాపుగా ఏక సమయంలో చేరాము. ఆ వేడుకలకి చిన్ని కాసిని తంగేడుపూలు ;) పంపుతారని సంబరపడేలోగా మీరు విరామం తీసుకున్నారు. తిరిగి రావటం యాదృఛ్ఛికమే అయినా మీరు సమయానికి అందుకుని పలుకరించారు. చాలా సంతోషం. వెలితి మిగలదిక. వచనాన, వచన కవితగా మన బ్లాగుల పురోగతిని ఆకాంక్షిస్తూ - మీ సాహితి మిత్రురాలు ఉష

    ReplyDelete
  51. * మాలా కుమార్ గారు, మా నాన్న గారి పెంపకంలో నేర్చుకున్న అంశాలు చెప్పాలంటే ముందుగా నేర్చుకున్నది పెద్దల్ని గౌరవించటం. "కవితల కి దూరం గా ఉండే నేను మీ కవితలను చదవకుండా వుండలేక పోతున్నాను" - నా బ్లాగు/రచనల పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ రాక మరువానికి గౌరవప్రదం. ఈ నా/మరుపవు శతం సందర్భంగా "మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది" [ఇది ఎందులోదో చెప్పనవసరం లేదు] అలాగే "ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో.." [చెన్నకేశవ రెడ్డి సినిమాలో పాట] గుర్తుకొస్తున్నాయి. ఎలాగూ కమ్మని గీతాలు ఏరితెచ్చి పెడతారు, ఇందులో ఒకటి తెచ్చివ్వరాదాండీ? మరువం అన్నది వేరే కారణంగా ఎంచుకున్నా ఈ పాటల సారానికి సరిపడేవిధంగా వున్నందుకు దైవానికి మరోసారి హృదయపూర్వక అభివందనం చేసుకుంటున్నాను.

    ReplyDelete
  52. మరువపుతోట మహారాణి గారికి శత టపోత్సవ అభినందనలు :)
    చాలా ఆలస్యంగా వచ్చాను. కానీ, అదీ ఒకందుకు మంచిదే అయినట్టుంది. మిత్రులందరి వ్యాఖ్యలు, వాటికీ పేరుపేరునా మీ స్పందనలు చదివి సంతోషించే భాగ్యం కలిగింది.
    మా లాంటి వాళ్ళం ఏదో ఒక పోస్టు రాసి వంద చేయచ్చు కానీ, వంద ఆణిముత్యాల్లాంటి కవితలతో ఇంత తక్కువ సమయంలో వంద టపాలు పూర్తి చేయడం మీకే చెల్లింది ఉష గారూ..! ఈ శుభసమయంలో అందుకోండివే మా అభినందన మందారమాలలు. చిన్న మొక్కగా మొదలైన మరువం ఒక పెద్ద తోటగా మారి అందరినీ మరువపు పరిమళాలతో అలరిస్తోంది. ఇలాగే మీ కవితా ప్రయాణం అప్రతిహతంగా సాగిపోతూ వేవేల కవితలు మీ మరువపుతోటలో ఉదయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    *అన్నట్టు, వర్ణాల గురించి మీ వర్ణన చాలా బాగుందండోయ్.!

    ReplyDelete
  53. "తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు
    వెలికి తెచ్చేటి రంగుల కలలు నిత్య జీవితానికి శ్వాసనిశ్వాసలు"
    మొదట పద్యమంతా చదువుతుండగా నాక్కలిగిన భావన, తెలుపెంత గొప్పదైనా, పవిత్రమైనా, మరీ అంతా తెలుపే అయితే బోరు కాదూ అని. ఆ మాటే వ్యాఖ్య రాద్దామనుకుంటూ పద్యం చివరికొచ్చేసరికి ఆ ఆఖరి వాక్యాలు .. ఒక్కసారి నా ఉభయశ్వాసల్నీ దోచేసి గొండెని రాగరంజితం చేశాయి. అభినందనలు!

    ReplyDelete
  54. మధుర, "మరువపుతోట మహారాణి" మీ సంబోధన ఒక క్షణం నన్ను ఆనందపు అంచులకి తీసుకుపోయింది. నిజానికి మరువం వనాన వున్నపుడే నా మనసు స్వేచ్ఛా విహంగం మాదిరిగానో, మహరాణీ తీరునో మనగలుగుతుంది. అభిమానం తొణికిసలాడుతున్న మీ ఒక్కొక్కమాట ఒక ఆణిముత్యంగా పదిలపరుచుకుంటాను. నను పలుకరించిన ప్రతివారికీ అలా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకోవటంలో ఏదో తృప్తి. నెనర్లు.

    ReplyDelete
  55. కొత్తపాళీ గారు, గత మే నెల 26 న నా మొదటి టపా, "సంతోషానికి కొలమానం ఏది? " http://maruvam.blogspot.com/2008/05/blog-post_25.html కి మొదటి వ్యాఖ్యాతగా మొదలైంది మీ రాక మరువపు వనానికి. కొన్ని చురకలు, మరికొన్ని అభినందనలు, మొత్తానికి గురువు గారు వస్తారా లేదా అని జిజ్ఞాస కలిగిస్తూ, వచ్చిపోతున్న ఆనవాళ్ళు వదిలి వెళ్తూ... మీరిస్తున్న తోడ్పాటుకి నా కృతజ్ఞతలు. నాక్కూడా శ్వేతం పరావర్తనం చెంది అలా రంగులు నింపగలిగితేనే కదా అందమైన రంగుల లోకం ఆవిష్కారమయేది అని అనిపించింది. అందుకే శీర్షిక అలా పెట్టాను ఆపై ముగింపు అలా తేల్చాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
  56. ఉష గారూ, శత టపోత్సవ సంరంభం వెయ్యి టపాకాయలు పేల్చి పండుగ చేసుకున్నట్లుగా వుంది. కాని మరి 101 మొదలయ్యేదెప్పుడు. సహశ్ర టపోత్సవం చూసేదెప్పుడు.

    ReplyDelete
  57. వర్మ గారు, "సహశ్ర టపోత్సవం" చేయగలనంటారా? ఇలా మీ అందరి అభిమానం చూసాక సంకల్పమైతే బలపడింది, మరువం ఆ మన్ననకి నోచుకోగల ప్రయత్నమూ మొదలైంది. ఒక ఆప్త మిత్రుని వ్యాఖ్య వచ్చేవరకు ముందుకు కదలనని మరువం మీద ఆన పెట్టాను. ఆ ఒక్కటీ సంపూర్ణమవగానే మళ్ళీ మన పయనం సాగిద్దాం. "వెయ్యి టపాకాయలు" అన్నారు, సంబరాలు, వేడుకలు వేలు కానీ ఇప్పటికి ఒక్కటీ కాల్చలేదు సుమీ, నన్ను బెదరేసిన అతి తక్కువ విషయాల్లో అదొకటి... గుర్తుగా నా రచనలపై ఆరా తీసినందుకు ఆనందం. నా నూటొక్క కవితల అందమైన రచన త్వరలో రానున్నది.

    ReplyDelete
  58. Usha garu chala bagundi andi mee blog ippude chusthunnau.
    Best of Luck andi
    http://mirchyvarma.blogspot.com please visit

    ReplyDelete
  59. గుంటూరు స్వస్థలి కనుక మంచి పిల్లాడైన మిర్చీ/హరీష్ వర్మ గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం. నా రచనలు నచ్చినందుకు థాంక్స్. మళ్ళీ మళ్ళీ వస్తుండండి. వ్రాయటం, చదవటం జిజ్ఞాసనుండి జనించినా, స్ఫూర్తి, ప్రేరణ లేనిదే మందగించిపోతాయి. మీ మూడు టపాలు చదివాను. మీకు కావాల్సిన నేస్తాలకి కొదవలేదీ నూతన కళారంగాన. ఇదొక రంగుల ప్రపంచం. భావానికి వ్యక్తమవ్వాలని, మనసుకి విప్పుకోవాలని, హృదయానికి పంచుకోవాలని, భావుకతకి రెక్కలు కట్టుకోవాలని ఆలోచన కలిగించే వేదిక ఇది. ఇష్టాగోష్టులు, అరమరికలు లేని సాహితీమైత్రి ఇక్కడి తీరుతెన్నులు. బ్లాగ్లోకానికి స్వాగతం.

    ReplyDelete
  60. "శ్వేతపద్మధరం దేవం, తం సూర్యం ప్రణమామ్యహం"
    ఆ సూర్యుని చేతిలో ఉన్న కమలాన్ని చూపించారు మీ కవితా వస్తువుతో!

    "సప్త వర్ణాల మిళితం శ్వేతం"
    ఇది భౌతికం!
    "ఆది పరాశక్తి మేని వన్నె శ్వేతం"
    ఇది భక్తితత్త్వం!
    "పసిపాప నవ్వు శ్వేతం ఆ కంటి నీరు నీలం"
    ఇది అమ్మతనం!
    "సీతమ్మోరి పూబంతి తెలుపు, చేత బట్టిన రామయ్య నలుపు"
    ఇది అనుబంధం!
    "ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం"
    ఇది నిజం!

    మరువానికి శతటపోత్సవానందాభిషేకం జరుగుతోంది. ఇది మీ ఆనందం.
    ఓ పెద్ద తోటలా అనిపించే ఈ అర్ణవంలో నాకూ కొన్ని పూలు దొరికాయి. అవిప్పుడు నా సొంతం. ఇది నా ఆనందం!
    మీ పాఠకుడిగా నా ఆనందమే నాకు గొప్ప.
    స్నేహితుడిగా మనిద్దరి ఆనందం కలిస్తేనే గొప్ప! ఎందుకంటే, మీ ప్రతినవ్వులో సగపాలు మీ హితులైన స్నేహితులకేగా!

    కాబోయే శతవ్యాఖ్యానోత్సవానందాభిషేకానికి మళ్ళీ అతిథిగా వస్తా, శలవు!

    ReplyDelete
  61. " ఆ వన్నె, ఈ వన్నె నడుమ నడిచేది జీవితం "
    ఎంత హృద్యంగా తత్త్వాన్ని బోధించారు.
    " శత టపోత్సవం " ... మిశ్రమ సమాసమైనా, చక్కని పదబంధాన్ని సృజించి " బ్లాగు " లోకానికి అందించారు.
    మీకు నా హృదయ పూర్వక శతాధిక శుభాభినందనలు !

    ReplyDelete
  62. ఆనంద్, చెప్పాల్సిన మాటలన్నీ అయిపోయాయిక. మౌనంగా ఈ అనుభూతిని అస్వాదించాలనివుంది. నా మాటలకి క్రొత్త అర్థాలు, వేర్వేరు కోణాలు వెదకటం మీకు అలవాటే ఈ చిరు కవితలని అందలం ఎక్కించటమూ అలవాటే. ధన్యజీవిని. నెనర్లు. మీ వ్యాఖ్య శతం పెట్టు. ఇక తిరిగి పయనం మొదలు పెడతాను.

    ReplyDelete
  63. డా.ఆచార్య ఫణీంద్ర గారు, పూర్ణమిదం. పరిపూర్ణం నా మోదం. ఇంతమంది మహామహులు వ్యాఖ్యానించాక మీ పదం కలవని వెలితి కొట్టొచ్చినట్లు కనపడి ఇదమిద్దంగా చెప్పలేని ఏదో భావన, ఆ ఒక్క లోటూ భర్తీ చేసేసాడు విధాత. ఒక్క క్షణం "అయ్యో, సంస్కృతం వచ్చివుంటే బాగుండుననిపించింది". మీ వ్యాఖ్య తో ఈ టపాకి వన్నె కూరింది.

    ReplyDelete
  64. నాకెపుడూ ఆనందం పంచిచ్చే మా మంచి పెద్దన్నయ్య మాట ఈ మరువాన మణి వోలె వెలగాలని, తన ఆశీస్సులతో మరింత ఎదగాలని మురిసిపోతూ..

    On Sun, Jul 26, 2009 at 10:14 AM, Sambasiva rao Kanneganti wrote:

    Dear Ushaa ! what a wonderful description of White and Black.

    Great attempt.

    I don't have that much literary talent to describe your description of telupu and nalupu.

    really I enjoyed it.

    ReplyDelete