చిత్రం!!!!!

నిన్న అనుభవం లోకి వచ్చిన ఒక సంగతికి తోడుగా, ఆత్రేయ గారి సత్యం ఇచ్చిన స్ఫూర్తితో....

పొంగి పొర్లే కన్నీటి ధారల్లో
ఉప్పోంగి వెల్లువయ్యే ఆనందభాష్పాల్లో
నింగి నంటినా నిలవననే ఆశాశిఖరాల్లో
నిబ్బరాన్ని సడలించే సంవేదనల్లో
ఎన్ని జీవిత సత్యాలో!!!!!

అసత్యాలెన్నో వెనుదీసాకా,
మరెన్నో ముసుగులు తొలిగాక,
మిగిలిన ఆ కొద్ది జీవితానా
అన్ని "చిత్రాలు" విచిత్రంగా,
ఆపనలవి కాని చిత్రాలే!!!!!

24 comments:

  1. విధి విచిత్రమే మరి !

    ReplyDelete
  2. సత్యాన్ని చిత్రంగా మీ చిత్రంలో వ్యక్త పరిచిన తీరు బాగుంది.

    ReplyDelete
  3. ఉప్పొంగి వెల్లువయ్యే ఆనందభాష్పాల్లో
    నిన్నటిరోజున ఒక టీవీ కార్యక్రమంలో చూసా విజేత కళ్ళల్లో

    ReplyDelete
  4. నిబ్బరాన్ని సడలించే సంవేదనల్లో
    ఎన్ని జీవిత సత్యాలో!!!!!

    అనుభవైకమే..
    నిజానికి సత్యం ముందు నిలబడేందుకు ఎంతో గుండెనిబ్బరం కావాలి. సత్యం అగ్ని సమానం.

    ReplyDelete
  5. ఉష గారు, చాలా బాగుంది.
    చిత్రం...విచిత్రం....అదే జీవితం.
    ఇది సత్యం...అనునిత్యం..
    సత్యాసత్యాల జీవితం క్షణభంగురం....
    తెలుసుకొనటమే అతీతం...

    ReplyDelete
  6. The second stanza is brilliant, beautiful and bitter. Nice. Your mark is visible.

    But one thing I searched, tried, and tested. Truth is above all the facts, and is meant for happiness. Indeed another meaning of truth is happiness. The search, the path and the result along with goal is all happiness.

    ReplyDelete
  7. సత్యాసత్యాల నడుమ జీవిత నాట్యాలు
    తెరవెనుక దాగిన నగ్నసత్యాలు

    తెరచి, తరచి చూసే ధైర్యం కొందరికే
    తలచి మార్చుకొనే హృదయాలెన్ని?
    తెరమరుగయ్యే జీవతాలే అన్నీ!

    మృదు మధుర మానస లయలో విరిసిన మంజుల మంత్రమది.

    ReplyDelete
  8. జీవితాన దోబూచులాడే ప్రతి భావమొక చిత్రమే... చిత్రాల నడుమన విచిత్రం గా సాగే జీవితం... ? ఏమో మరి...

    ReplyDelete
  9. భావం బాగుంది

    చిన్న పరిశీలన

    మీ అంత్యప్రాసల లౌల్యం కొంచెం తగ్గించుకోవలసిన అవసరం ఉందనిపిస్తుంది. :-))

    ఉదా: లెక్కలేనన్ని జీవిత సత్యాలో!!!!!

    లెక్కలేనన్ని జీవిత సత్యాలో!!!!!

    ReplyDelete
  10. పూర్తి చేయకుండానే పబ్లిష్ అయిపోయింది. సారీ
    లెక్కలేనన్ని జీవిత సత్యాలో!!!!!

    లెక్కలేనన్ని జీవిత సత్యాలు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. బాబా గారు,

    అది ముందు
    ఎన్ని జీవిత సత్యాలో!!!!!

    అన్న పంక్తి

    తెలిసిన వారు తర్వాతి పంక్తి కూడా

    "ఎన్ని ... " మొదలౌతుంది అనటంలో ఆ సర్దుబాటులో + ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ లో మనసటుగా వుండటంలో ఈ పొరపాటు దొర్లింది.

    ఇక మీకు నాకు ఈ అంత్యప్రాసల విషయమై భేటీ తప్పదు కదా! :)

    చాలా థాంక్స్ మార్చేస్తున్నాను.

    ReplyDelete
  12. ఉష గారు

    మీకలాంటి (పునరుక్త) అనుమానం వచ్చినపుడు తరువాత వాక్య నిర్మాణం మార్చేసుకోవచ్చు.
    అంటే
    ఎన్ని అసత్యాలో వెనుదీసాక,
    అసత్యాలెన్నో వెనుదీసాకా
    అపుడు బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. (జలసూత్రం గారిక్కడ లేరు కదా! కొంపదీసి)

    just sharing views thats all. no intention to belittle you.

    good luck

    ReplyDelete
  13. బాబాగారు ఎలాగూ ఈకలు పీకడం మొదలెట్టారు కనుక నాకు తోచింది. ఒక్కొక్కరిదొక బాణి కాబట్టి అందరికీ నచ్చాలని లేదు.

    పొంగి పొర్లే కన్నీటి ధారల్లో
    ఉప్పోంగి వెల్లువయ్యే ఆనందభాష్పాలు.

    నింగి నంటినా నిలవననే ఆశాశిఖరాల్లో
    నిబ్బరాన్ని సడలించే సంవేదనల్లో
    ఎన్ని జీవిత సత్యాలు?

    ReplyDelete
  14. బాబా గారు, నాకు మనస్తాపం కలిగించారు మీరా వివరణ ఇచ్చి. నాకు నెగటివ్ ఆలోచనలు తక్కువ. "అయితే ఆతుకూరు, పోతే గొట్టిపాడు" ముందుగా పాజిటివ్ గా తీసుకోవటం లేదా నా గుడ్ కర్మసూత్రానికి సరిపెట్టటం. మీ ఉద్దేశ్యం తెలుసు నాకు.

    "అసత్యాలెన్నో వెనుదీసాకా" తీసుకున్నాను కవితలోకి. నాకు అలా రెండు మూడు నిమిషాల్లో కవితలు వ్రాసిపడెసే గుణం తగ్గాలి కదండి? :)

    ఇక పాపం వారిని [పెద్దవారిని అస్తమాను పేరుతో పిలువకూడదట! ;)] మీరూ నిదుర పోనీయరా, ఆయన తెరముందుగా శాశ్వత సెలవు ప్రకటించుకున్నారుగా :) ఏదైతేనేమి కానీ మీకూ అల్లరి ఇష్టమని నాకూ తెలిసిపోయిందోచ్.

    ReplyDelete
  15. @ పరిమళం, సునిత, థాంక్స్.

    @ విజయ్, నచ్చినందుకు ధ్యన్యవాదాలు

    @ విజయమోహన్ గారు, నిజమండి అలా చూస్తే కలిగే స్పందన వేరు.

    ReplyDelete
  16. కుమార్, గీతాచార్య, మీ అభిప్రాయాల్లో భావ సాపత్యం వుంది. సత్యాన్ని అంగీకరిస్తే కలిగే శాంతి నాకు అనుభవైక్యం.

    ReplyDelete
  17. జయ, భావన, చక్కగా వ్యక్తపరిచారు. ధన్యవాదాలు. మనమెన్ని సార్లు ఈ సత్యాసత్య సమీక్షల చిత్రాల్లో విచిత్రంగా చిక్కుకోము? నాకు ఒక్కోసారి నేనే అసత్యమా అన్నంత గగుర్పాటు, జీవితమే చిత్రమన్న గమ్మత్తైన భావన. ఆ మాదితి అలవోక నుండి జారిన ఆశుకవితిది.

    ReplyDelete
  18. భా.రా.రె. రెండు సార్లు స్పందన జోడించి ఇచ్చిన ఈ వ్యాఖ్యా కవితలు బాగున్నాయి. ఇక ఈ చిరు కవితని మార్పుల చేర్పుల శస్త్రచికిత్సకి లోనుచేయలేనేమో? :) మీ బాణీ బాగుంది. అయినా అలవాటేగా మరో కవిత కలిపేయటం, ఆగారేం, ఆలస్యమెందుకిక? ;) ఇక్కడకి "వచ్చేవారంతా" అలా ఈకలు పీకాలనే నా అభిలాష. అందువలనే నేను మరిన్ని మొలకలు ఈ వనాన నాటగలను. థాంక్స్.

    ReplyDelete
  19. Oh... antha ayipoyaaka vacchinattunaa.. jeevitham..kshanikam alage O yugamantha.. bhaaram.. asathyaalanunchi, sathyanni vedakatam modalu pettinattaithe.. inka bhavishyatthu anthaa.chithrame avuthunthi.. correctenaa.. Yedo aapukoleka anesaa ;-)

    ReplyDelete
  20. @ శివ, అదే కదా అంటున్నది. ఎప్పుడు వచ్చామన్నది కాదు ఏమని కామెంటామన్నదే ప్రశ్న ;) అవునా ? థాంక్స్.

    @ బాబా గారు, కాపి అండ్ పేస్ట్ - :)

    ReplyDelete
  21. ఆహా
    నిబ్బరాన్నే సడలించేట్టుగా చేస్తున్నాయా సంవేదనలు .... హృదయంలో మునిగి తేలినట్టున్నాయి పదాలు... అద్భుతంగా ఉందండి మీ భావుకత ... మీకు నా హృదయపూర్వక నమస్కారాలు...

    భవదీయుడు
    yours mute follower
    నరసింహ మూర్తి

    ReplyDelete
  22. అవునూ, మరి ఇపుడెందుకు బయటపడ్డారుట నరసింహ మూర్తి గారు? ;) థాంక్స్, ఎంతైనా నా చిత్రం భలే చిత్రం చేసినట్లుందే? Sure some feelings do come out to touch the right chords. I belive this one finally made a way in to your heart and hence I feel good about it!!!!!!

    ReplyDelete