నవంబర్ నెలలో నేర్చిన పాఠాలు

*** వచ్చే వారం "థాంక్స్ గివింగ్ సెలవుల" వలన క్లాస్ లేదు. ఇవి నవంబర్ నెల పాఠాల వివరాలు.

తెలుగు పాఠాలు విదేశంలో పెరుగుతున్న పిల్లలకి చెప్తున్నవి కనుక దాదాపుగా వాళ్ళంతా అతి తక్కువగా తెలుగు మాట్లాడివుంటారు కనుక, పిన్న వయస్కులు కనుక పాఠాలు కాస్త క్రొత్తగా ఆట, పాటలు కలిపి చెప్తాను. ఈ విధంగా వాళ్ళలో క్లాసుకి రావాలన్న ఉత్సాహం కనపడుతుంది.

.. అక్షరమాల లోని అచ్చులు, హల్లులు అన్నీ పెద్ద పిల్లలు గుర్తించ గలిగి, పలికి, సరళమైన పదాలు, వాక్యాలు వ్రాయగలుగుతున్నారు.
ఉదా: గారెలు, నాకు పాలు కావాలి

.. మనం నేర్చుకున్నట్లుగా కాక కాస్త మార్పుతో నేర్పుతున్నాను.
ఉదా:
** సున్న వ్రాసి, దాన్నుంచి వచ్చే అక్షరాలు ఒక సమూహం లో - మ,య, ప, వ, అ, ఆ, ర ....
** డబ్ల్యు వ్రాసి దాన్నించి వచ్చే అక్షరాలు - చ, ఐ, ఉ, జ ...
** యెస్ వ్రాసి - క, క్ష

.. అక్షరాల తేడాలు తెలుసుకున్నారు. ఒకటి చెప్తే దానికి క్లోజ్ కజిన్ గురించి చెప్తున్నారు.
ఉదా: స, న; ప, వ; మ య

.. వత్తులు తెలుసుకున్నారు.

.. గుణింతాలలోని ఎక్సెప్షన్స్ దాదాపుగా గుర్తుపడుతున్నారు.
ఉదా: క -కు; ర - రు; వ -వు [మ అని ఎందుకు వ్రాయరు?]

.. వత్తులు, గుణింతాలు కలిపిన అక్షరాలు పలకటం, అవి వున్న పదాలు గుర్తించటం
ఉదా: స్నేహ, స్ఫూర్తి, జన్యా, అమ్మమ్మ, అన్నయ్య, నేర్పే...

.. చిన్నారులు [ఐదారేళ్ళ వయసు వారు] కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

.. ఇప్పుడు ఇద్దరిద్దరిని కలిపి టీం వర్క్ చేయిస్తున్నాను.

.. పాట:

- అమ్మ కు జై జై

.. కథ:
- చాలా చెప్పుకున్నాం. మీకు అవన్ని చెప్పం. ;)



2 comments:

  1. మీరు చేయిస్తున్న కృత్యాలు కూడా రాస్తే నలుగురికీ ఉపయోగపడతాయి. అక్షరాలను వరుస క్రమంలో నేర్పించకుండా మంచి పని చేస్తున్నారు.

    ReplyDelete
  2. చాలా బాగుందండీ మీ క్లాసు. మనఃపూర్నకంగా శుభాకాంక్షలు. మీకృషి ఎంతైనా మెచ్చుకోదగ్గది, ముఖ్యంగా ఆంధ్రాలో పిల్లలకీ, కొందరు పెద్దలకీ కూడా తెలుగు రానిరోజుల్లో.

    ReplyDelete